తాజా వార్తలు

Thursday, 9 June 2016

బాలయ్య గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనైన క్రిష్ !

బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి, దర్శకుడు క్రిష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య గురించి మాట్లాడుతూ క్రిష్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రికి తన తల్లిని తీసుకువచ్చానని... ఇంత గొప్ప ఆసుపత్రిని నిర్వహిస్తున్నందుకు బాలయ్యకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు క్రిష్ తెలిపారు. 99 సినిమాలు చేసిన హీరో ఒక డైరెక్టర్‌తో ఇంత స్వేచ్ఛగా వ్యవహరించడం తానెప్పుడూ చూడలేదని... బాలయ్య సింప్లిసిటీకి అదే నిదర్శనమని కొనియాడారు. బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్రిష్ తన ప్రసంగాన్ని ముగించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment