తాజా వార్తలు

Saturday, 11 June 2016

ఫ్రూటీ ముగ్గురు పిల్లల్ని ఆసుపత్రికి చేర్చింది

ప్రముఖ శీతల పానీయం ఫ్రూటీ దెబ్బకు హైదరాబాద్ మహానగరంలోని ముగ్గురు చిన్నారు తీవ్ర అస్వస్థతకు గురి కావటం ఆందోళనకరంగా మారింది. పాతబస్తీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం కలకలాన్ని రేపటంతో పాటు.. భయాందోళనలకు గురి చేస్తోంది. పాతబస్తీలోని కాలాపత్తర్ లో ఫ్రూటీ జ్యూస్ తాగిన (టెట్రా పాకెట్) ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ముగ్గురు చిన్నారుల్ని ఇంజిన్ బౌలిలోని ఫర్హా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఉదంతంపై అప్రమత్తమైన పోలీసులు ప్రూటీ గోదాముల మీద దాడి చేసి.. స్టాక్ స్వాధీనం చేసుకొని పరీక్షలు జరుపుతున్నారు.ఈ ఉదంతం ఎలా జరిగిందన్న విషయం మీద దృష్టి సారించిన పోలీసులు.. ఈ ఘటన మీద విచారణ చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఘటనతో శీతలపానీయాల వాడకం మీద సోషల్ మీడియాలో చర్చ షురూ అయ్యింది. నిజంగానే నాణ్యత లేని కారణంగా చిన్నారుల ఆరోగ్యం మీద ప్రభావం పడిందా? మరేదైనా కారణం ఉందా? అన్నది పోలీసులు తమ దర్యాప్తులో తేల్చాల్సి ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment