తాజా వార్తలు

Thursday, 9 June 2016

మెజారిటీ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడమే ఇష్టమట!

ఉద్యోగం చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఇంటి నుంచి పని చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు హెచ్‌ఆర్‌ సర్వీసుల సంస్థ రాండ్‌స్టడ్‌ సర్వేలో వెల్లడైంది. ఇలాంటి వారిలో 45 ఏళ్ల వయసు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారు. దేశవ్యాప్తంగా 7,500 మంది ఉద్యోగులను సర్వే చేసి సంస్థ తాజాగా ఫలితాలను ప్రకటించింది. ఇందులో 53 శాతం మంది టెలీకమ్యూటింగ్‌ (ఇంటి నుంచి పని)కు ప్రాధాన్యం ఇచ్చారు. 47 శాతం మంది ప్రతి రోజు ఆఫీసుకు వెళ్లి పని చేయడమే ఇష్టమని తెలిపారు. పురుషుల్లో 52 శాతం మంది, మహిళల్లో 54 శాతం మంది టెలీకమ్యూటింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు పేర్కొన్నారు. వీరిలో 45 ఏళ్లు, అంతకు మించిన వయసు కలిగిన వారే ఎక్కువగా ఉన్నా రు. ప్రస్తుత పనికి సంబంధించిన షెడ్యూల్‌ సంతృప్తికరంగా ఉందని 58 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కువ వేతనం ఇస్తే ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని 36 శాతం మంది చెప్పారు. పని గంటల విషయానికొస్తే.. వారానికి 45 గంటలకు పైగా పని చేస్తున్నామని 40 శాతం మంది తెలిపారు. వారంలో 45 గంటలకు పైగా పని చేస్తున్నామని 46 శాతం మంది పురుషులు, 32 శాతం మంది మహిళలు పేర్కొన్నారు. వారంలో సగటున మహిళలు 35 గంటలు, పురుషులు 39 గంటలు పని చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది.
« PREV
NEXT »

No comments

Post a Comment