తాజా వార్తలు

Friday, 3 June 2016

ఓవర్సీస్ లో మరోసారి సత్తా చూపిన త్రివిక్రమ్…

ఫ్యామిలీ సినిమాలకు ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తాయి ఫ్యామిలీ మూవీస్. ఇక అందరినీ మెప్పించే విధంగా సినిమాలు తీసే త్రివిక్రమ్ కు అక్కడ భారీ డిమాండ్ ఉంది. అక్కడ అతడి సినిమాలకున్న పట్టు ‘అ ఆ’ తో మరోసారి రుజువైంది. గురువారం విడుదలైన ‘అ ఆ’ సినిమాకు యూఎస్ లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

తొలి రోజున ఈ సినిమా యూఎస్ లో ప్రీమియర్ షోస్ ద్వారానే 1.69కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఎలాగూ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి, చాలా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు త్రివిక్రమ్ దర్వకత్వంలో వచ్చిన ‘అతడు’, ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా ఓవర్సీస్ లో మంచి లాభాలను తీసుకొచ్చాయి. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, నదియా, రావు రమేష్ తదితరులు ఈ సినిమాలో ప్రముఖ పాత్రలలో నటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించగా, రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment