తాజా వార్తలు

Saturday, 25 June 2016

ప్రెస్‌మీట్‌ మధ్యలో ఆప్‌ ఎమ్మెల్యే దినేష్‌ అరెస్ట్‌…

ఈవ్ టీజింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేయడం ఢిల్లీలో ఉద్రిక్తతకు దారి తీసింది. సంగమ్ విహార్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న దినేష్‌ మొహానియా కొంతమంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణకు సహకరించిక పోవడంతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోన్నమొహానియాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నీటి సరఫరా సరిగ్గా లేదని ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే దినేష్‌ ఆఫీస్‌కు వెళ్లిన మహిళల పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని కేసు నమోదైంది. ఆఫీస్‌ నుంచి బయటకు తోసేశారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో జూన్‌ 23న కేసు నమోదు చేశారు పోలీసులు.
ఎమ్మెల్యే దినేష్‌ అరెస్ట్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. దీని వెనుక మోదీ హస్తముందంటూ ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీలో అత్యవసర పరిస్థితి నడుస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కేజ్రీవాల్.
« PREV
NEXT »

No comments

Post a Comment