తాజా వార్తలు

Monday, 6 June 2016

తెరపైకి మరో వారసురాలు

టాలీవుడ్ లో మరో వారసురాలు వెండి తెరపైన కనిపించేందుకు రెడీ అవుతోంది. కమెడియన్, రచయిత ఉత్తేజ్ కుమార్తె చేతన హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తోంది. రెండో సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. టీనేజీ లవ్ స్టోరీ 'పిచ్చిగా నచ్చావ్', హర్రర్ మూవీ 'షీ'లో నటిస్తున్నట్టు చేతన తెలిపింది. బాలనటిగా పలు సినిమాల్లో ఆమె నటించింది. 'చిత్రం' సినిమాలో కుక్కపిల్ల కావాలని సందడి చేసింది చేతనే. 'బద్రీ', భద్రాచలం సినిమాల్లోనూ బాలనటిగా చేసింది.
హీరోయిన్ కావాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్నని చేతన తెలిపింది. ఆమె కూచిపూడి కూడా నేర్చుకుంది. 'నటిని కావాలనుకుంటున్నానని ఇంటర్మీడియట్ లో నాన్నను చెప్పా. ఆయన నో అని చెప్పలేదు కానీ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంద'ని చెప్పినట్టు వెల్లడించింది.

టాలీవుడ్ లో వారసురాళ్ల తెరగ్రేటం క్రమంగా పెరుగుతోంది. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా నటించింది. హీరో రాజశేఖర్ కుమార్తె శివాని కూడా వెండితెరపై కనిపించనుందని ప్రచారం జరుగుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment