తాజా వార్తలు

Thursday, 23 June 2016

‘కాల్ గర్ల్’గా మారిన తెలుగు హీరోయిన్!

‘నచ్చావులే’ సినిమాతో తెలుగువారిని పలుకరించిన హీరోయిన్ మాధవీలత. ఆ తర్వాత అడపాదడప సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు షార్ట్ ఫిలింస్ పై దృష్టి పెట్టింది. త్వరలో రానున్న ‘ఆన్ మోనాస్ బర్త్ డే’ షార్ట్ ఫిలింలో ఆమె ‘కాల్ గర్ల్’ పాత్ర పోషించనుంది.

నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం టీజర్ ను తాజాగా యూట్యూబ్ లో విడుదల చేశారు. అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్రదేశంలో నడుచుకుంటూ వస్తున్న మాధవీలతను ఇందులో చూపించారు. మరో సీన్ లో కారులో చిన్నారితో మాట్లాడుతూ ఆమె కనిపించారు. ఆమె, ఆమె ఏడేళ్ల కొడుకు ఇతివృత్తంగా ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కినట్టు చిత్రవర్గాలు తెలిపాయి. గ్రిప్పింగ్ ప్లాట్ తో తెరకెక్కినట్టు కనిపిస్తున్న ఈ షార్ట్ ఫిలిం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

ఇందులో తన పాత్ర గురించి అడుగగా.. ‘కాల్ గర్ల్’ పాత్ర పోషించడం సవాల్ తో కూడుకున్నదని, అందుకే తాను ఈ పాత్రకు ఒప్పుకున్నానని మాధవీలత తెలిపింది. అయితే, ప్రస్తుతం పెద్దగా తన చేతిలో సినిమా ఆఫర్లు లేకపోవడంతోనే ఆమె షార్ట్ ఫిలింలో నటించడానికి ఒప్పుకున్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment