తాజా వార్తలు

Thursday, 2 June 2016

అమీ జాక్సన్ కల నెరవేరేలా ఉంది…

బ్రిటన్ మోడల్ అయినప్పటికీ, ఇండియన్ మూవీస్ లో తన సత్తా చాటుతున్న అమీ జాక్సన్ కల నెరవేరేలాగ ఉంది. ఇంతకీ ఆమె కల ఏంటనేగా మీ సందేహం. ఏం లేదండి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో భాగంగా మీకు ఎవరితో నటించాలనుందని అడగగా.., వెంటనే తడబడకుండా “ప్రభాస్ ఇండియన్ ఐకాన్ అని, అతనితో నటించాలనుందని” చెప్పేసింది. ఇప్పుడు ఈ కోరికే నెరవేరేలా ఉంది.
ఎందుకంటే ‘బాహుబలి-2’ తరువాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా అమీని అనుకుంటున్నారట. ప్రభాస్ పక్కన అమీ అయితేనే భావుంటుందని సుజిత్ భావిస్తున్నాడట. మరి అమీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment