తాజా వార్తలు

Saturday, 4 June 2016

సీఎం కావాలనే ఆరాటంతో ఇష్టమొచ్చిన హామీలు: వైఎస్ జగన్

అనంతపురం జిల్లాలో కరువు, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా తాను 80 కుటుంబాల దగ్గరకు వెళ్లడం జరిగిందన్నారు. చనిపోయిన ఆ కుటుంబాల్లో దాదాపుగా 15మంది చేనేత కార్మికుల కుటుంబాలు ఉంటే, మిగతావి రైతు కుటుంబాలే అన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.

ముఖ్యమంత్రి కావాలన్న ఆరాటంతో చంద్రబాబు నాయుడు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, అయితే ఎన్నికలు అయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. రుణమాఫీ అంటూ హడావుడి చేసినా, రైతుల వడ్డీలో ముప్పావు వంతు కూడా ఇవ్వలేదన్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజుకు చేరింది. కదిరిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.
« PREV
NEXT »

No comments

Post a Comment