తాజా వార్తలు

Monday, 20 June 2016

ఏరువాకకు ఏపీ సీఎం శ్రీకారం…

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు… వాటిని అందుకోవడంలో ఆంధ్ర రైతులు ముందుండాలని సూచించారు బాబు… రైతుల కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చిందన్న ఆయన… అన్నదాతల సంక్షేమమే తమ ప్రభుత్వానికి శ్రీరామ రక్షఅన్నారు.
భవిష్యత్‌లో నీటి సమస్యలు రాకుండా నదుల అనుసంధానాన్ని చేపడుతున్నామన్న చంద్రబాబు… సకాలంలో విత్తనాలు అందజేశామన్నారు. పొదుపుగా నీటిని వాడుకున్న రైతులు పంటలు పండించడంలో రికార్డ్ సృష్టించారని ప్రశంసించారు సీఎం…
పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిట్టవరంలో దుక్కిదున్ని ఏరువాక పౌర్ణమిని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా పంటపొలంలోకి దిగిన చంద్రబాబు.. నాగలి పట్టి ఎడ్లను తోలారు.
అనంతరం వ్యవసాయ, మత్య, పశుసంవర్దక శాఖలు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించిన చంద్రబాబు… ఎపిఇపిడిసిఎల్‌ ఆధ్వర్యంలో లబ్దిదారులకు ఫ్యాన్లు పంపిణీ చేపట్టారు. ఏరువాక పవిత్రమైన కార్యక్రమన్న చంద్రబాబు… కాంగ్రెస్‌ హాయాంలో రైతులు ఇబ్బందిపడ్డారన్నారు. ఏరువాక ద్వారా ప్రజల్లో చైతన్యం రావాలని చెప్పారు.

« PREV
NEXT »

No comments

Post a Comment