తాజా వార్తలు

Monday, 6 June 2016

ఆధునిక బస్సులను ప్రారంభించిన సీఎం…

వినూత్న పద్ధతులను పాటించి ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పలు సౌకర్యాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించిన సిటీ బస్ టెర్మినల్‌ను ప్రారంభించారు.

రాజధాని అమరావతి పేరుతో ఏర్పాటు చేసిన ఆధునిక బస్సు సర్వీసును లాంచ్ చేశారు చంద్రబాబు. జీపీఎస్‌ ద్వారా ఆర్టీసీ బస్సు సర్వీసు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా రూపొందించిన మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇందులో లైవ్ టీవీ సౌకర్యాలు ఉంటుంది.

ఈ బస్సు ప్రతి సీటు వెనకాల టీవీ ఏర్పాటు చేసి మనకు నచ్చిన ఛానెల్‌ చూసేందుకు రిమోట్‌ కూడా ఇస్తున్నారు. ఈ సౌకర్యాన్ని 80 అమరావతి బస్సుల్లో అందుబాటులోకి తెచ్చారు. బెజవాడ బస్టాండ్ రూపురేఖలే మారిపోయాయని… ఎయిర్‌ పోర్టు తరహాలో బస్ పోర్టు ఏర్పడిందన్నారు సీఎం చంద్రబాబు.
« PREV
NEXT »

No comments

Post a Comment