తాజా వార్తలు

Tuesday, 28 June 2016

చైనాలో కొనసాగుతున్న ఏపీ సీఎం పర్యటన…

చైనాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మూడు రోజు గుయాంగ్‌లో పలు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు.

మరోవైపు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు పీవీ శ్రీకారం చుట్టారని కోనియాడారు బాబు… పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను తానూ కొనసాగించానని పేర్కొన్నారు ఏపీ సీఎం.
« PREV
NEXT »

No comments

Post a Comment