తాజా వార్తలు

Saturday, 11 June 2016

ఏడు ప్రాజెక్టులకు ప్రాధాన్యత…

ప్రస్తుతం మనకు నీటి భద్రత అవసరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలోని ఇరిగేషన్‌ శాఖ కార్యాలయంలో వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ప్రారంభించారాయన. ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా పంటలకు గాని, మంచినీటి అవసరాలకు గాని ఇబ్బంది లేకుండా చూసేందుకు వాటర్‌ సెక్యూరిటీ విధానం ఉపయోగపడుతుందన్నారాయన.
అలాగే, లైవ్‌ కెమెరాల సాయంతో ప్రాజెక్టుల పనితీరును సమీక్షించే ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. ఏడు ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టులుగా తీసుకున్నామని… ఈ ఏడాది చాలా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను కలిపాం. గోదావరిలో ఇన్‌ఫ్లో పెరిగితే ఆ నీటిని కృష్ణానదికి తీసుకొస్తామన్నారు చంద్రబాబు.
శ్రీశైలంలో నీరు నిల్వ చేసి కరవు ప్రాంతాలకు వినియోగిస్తామన్నారు ఏపీ సీఎం. రాబోయే రోజుల్లో కృష్ణా, పెన్నాను అనుసంధానం చేస్తాం. స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.
« PREV
NEXT »

No comments

Post a Comment