తాజా వార్తలు

Monday, 6 June 2016

త్వరలో 6 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ…

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌శాఖలో ఆరు వేల పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు డీజీపీ జేవీ రాముడు. 6 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలియజేశారు. డిపార్ట్‌మెంట్‌లో ఇంకా పూర్తి స్థాయిలో విభజన జరగలేదని… అయినా సవాళ్లను అధిగమించి ముందుకు వెళుతున్నామన్నారాయన.

రాష్ట్రంలో పూర్తిస్థాయి పోలీసు శిక్షణా కేంద్రం లేనందున్న అనంతపురంలోని పోలీసు శిక్షణ కాలేజీలో కొత్తవారికి శిక్షణ ఇస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు డీజీపీ రాముడు.

కృష్ణా పుష్కరాల్లో భద్రతకు 33 వేల మంది అదనపు ఫోర్స్‌ అవసరమన్న డీజీపీ రాముడు… పుష్కరాల్లో భద్రతకు ఇతర రాష్ట్రాల నుంచి సిబ్బందిని పంపాలని కోరామని తెలియజేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment