తాజా వార్తలు

Friday, 10 June 2016

ఎవరికీ మినహాయింపు లేదన్న బాబు…!

ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. రాజధానికి తరలిరావడంపై తమకు ఉన్న సమస్యలను విన్నవించారు. తరలింపునకు మరో ఆరు నెలలు లేదా ఏడాది గడువు ఇవ్వాలని కోరారు. వారి సమస్యలను విన్న చంద్రబాబు.. సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు ఉద్యోగుల ప్రతినిధులు.

ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు చెప్పారు. కానీ, తరలింపు విషయంలో వారి విజ్ఞప్తిని తిరస్కరించినట్టు తెలుస్తోంది. తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా అశోక్‌బాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సమస్యలపై నన్ను కలవకుండా ఇతర పార్టీ నేతలను కలిస్తే పరిష్కారం అవుతాయా అని చంద్రబాబు ప్రశ్నిచారట. రాజకీయం చేయొద్దని సూచించారట. అమరావతి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పారు సీఎం చంద్రబాబు… సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి, తరలింపు విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment