తాజా వార్తలు

Monday, 6 June 2016

మరోసారి ‘అయ్యో అయ్యో అయ్యయ్యో’ …

వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాబు బంగారం’ టీజర్ విడుదలైంది. ఇందులో వెంకటేష్, నయనతారను మరింత అందంగా చూపించాడు డైరక్టర్ మారుతి. “ఇలాంటి అమ్మాయి ఇంతవరకు చూడలేదురా.., మనసుకు మనసు, జాలికి జాలి” అని వెంకటేష్ అంటుండగా, “ఏజ్ కు ఏజ్” అని వెన్నెల కిషోర్ పంచు సూపర్ గా ఉంది. ‘ఘర్షణ’ తరువాత ఈ సినిమాలో మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించాడు వెంకటేష్.
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సెట్ అయ్యే నయనతార ఇందులో వెంకీ సరసన సూపర్ గా అనిపిస్తోంది. అప్పుడెప్పుడో ‘బొబ్బిలి రాజా’ సినిమాలో బాగా ఫేమస్ అయిన ‘అయ్యో అయ్యో అయ్యయ్యో’ అనే డైలాగ్ ను మరోసారి ఈ సినిమాలో తనదైన స్టైల్ లో చెప్పాడు వెంకటేష్. గిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సూపర్ గా ఉంది. రిచార్డ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తరువాత మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

« PREV
NEXT »

No comments

Post a Comment