తాజా వార్తలు

Friday, 3 June 2016

బాబుకు మతిమరుపు వ్యాధి

ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని, ప్రజల ఆక్రోషాన్ని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిబింబించేలా చంద్రబాబును చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారని వైయస్‌ఆర్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ ఉప్పులేటి కల్పన అన్నారు. ప్రజలను మోసం చేసింది కాకుండా..ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతపై అధికార పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం శోచనీయమని ఆమె మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆమె హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో  ఆమె విలేకరులతో మాట్లాడారు. 

రైతు కుటుంబాల ఓదార్పులో భాగంగా మాట్లాడితే దానిని టీడీపీ మంత్రులు వక్రీకరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైయస్‌ జగన్‌ని మగాడివా..? సైకో, ఖబడ్దార్‌ అని  దుర్భాషలాడలేదా అని నిలదీశారు. చెప్పులతో కొడతారు అంటే టీడీపీ మంత్రులు ఇంతగా ఊగిపోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల ముందు రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏ గ్రేడ్‌లో ఉన్న 7.30 లక్షల మంది సభ్యులు బీ గ్రేడ్‌కు పడిపోయారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం , నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి,  ఇంత వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేక పోయారు. మూడు వందలకు పైగా హామీలు ఇచ్చి ప్రజలను వంచిస్తే వారు ఏం చేయాలి..? వారికి మాత్రం బాధ ఉండదా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. జనాల్లో తిరగలేక దూరంగా ఉంటున్నారు.  అన్యాయం జరిగింది కాబట్టే ప్రజలు  చెప్పులతో కొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 

ఆ దీక్ష ఎందుకు..?
అధికార టీడీపీ ఎందుకు నవనిర్మాణ దీక్ష పెట్టిందో వాళ్లకే అర్థం కాని పరిస్థితి ఉందని  ఉప్పులేటి కల్పన అన్నారు. మహానాడులో గానీ, నవనిర్మాణదీక్షలో గానీ ప్రతిపక్ష పార్టీని, నాయకుడిని టార్గెట్ చేసి దుమ్మెత్తిపోయడం తప్ప ...ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఈరెండేళ్ల పాలనలో ఏం చేశారో, మిగిలిన మూడేళ్ల కాలంలో ఏం చేయనున్నారో చెప్పకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు దాదాపు 300 హామీలిచ్చిన చంద్రబాబు దాంట్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదని కల్పన ఫైరయ్యారు. కనీసం ఇచ్చిన హామీలు ఎందుకు నేరవేర్చలేదో కూడా చెప్పలేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. 

ప్రజలకు ఏం చెప్పాలో తెలియక ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేసుకొని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతిపక్షమే లేకుండా చేస్తానని చెప్పడం హేయనీయమన్నారు.  చంద్రబాబు అవినీతి రహిత రాష్ట్రం సాధిద్దాం అని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారని, ప్రజలు నీతిగా ఉండాలి ప్రభుత్వ మాత్రం అవినీతిగా ఉంటుందని చెప్పకనే చెప్పినట్లుందన్నారు. బెల్ట్‌షాపులు బంద్‌ చేస్తామని చెప్పారు.  రాష్ట్రంలో విచ్చల విడిగా బెల్ట్‌షాపులు పుట్టుకొస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. 

బాబు అధికారం శాశ్వతం అనుకుంటున్నారు
చంద్రబాబుకు మతిమరుపు వ్యాధి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేతల్లోంచి వార్తలు వస్తున్నాయని ఉప్పులేని కల్పన చెప్పారు. గంట తరువాత వచ్చిన వారిని గుర్తు పట్టలేకుండా ఉన్నారని, అందుకే టీడీపీ నేతలు ఆ వ్యక్తిని పదేపదే పిలుస్తూ చంద్రబాబుకు ఆ వ్యక్తిని గుర్తు చేస్తున్నారని చెప్పారు. అదేరీతిలో రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్నది మరిచి  35 ఏళ్లు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంటుందని మాట్లాడడమే నిదర్శనమన్నారు. అధికారం శాశ్వతం అనుకుంటూ ఊహాగానాల్లో బతుకుతున్నారన్నారు. టీడీపీ నేతలకు మతిస్థిమితం సరిగాలేదని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు సోదరుడు నారా రాంమ్మూర్తి నాయుడు, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు  మతిస్థిమితం సరిగ్గా లేదని,  కాల్పులు జరిగినప్పుడు 5 ఆసుపత్రుల నుంచి సర్టిఫికేట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. హుండీలో ఆదాయం పెరుగుతుంది. పాపాలు ఎక్కువగా చేసే వారు దేవుడి హుండీలో ఎక్కువగా డబ్బులు వేసి పాపాలు కడిగేసుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. అయ్యప్ప స్వాములు దీక్ష చేయడం వల్లే మద్యపాన ఆదాయం తగ్గిపోయిందని మాట్లాడి అయ్యప్ప  భక్తులను కించపరిచారని గుర్తు చేశారు. 

అదే విధంగా ఒక విలేకరుల సమావేశంలో దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అనడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు ప్రజలకు ఏం చేశారని గెలిపిస్తారనుకుంటున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ప్లాన్‌ బెడిసికొట్టిందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజ్యసభ సీటు దక్కనీయకుండా చేయాలని టీడీపీ శతవిధాలా ప్రయత్నించిందని చెప్పారు.  పార్టీ రాజ్యసభ సీటును ఏం చేయలేకపోవడంతో బాధతో కుతకుతలాడుతున్నారన్నారు. 

వైయస్‌ జగన్‌ యాత్ర చూస్తుంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో ఉన్న బలం ఇంకా పెరుగుతుందని స్పష్టం అవుతుందన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనగలరు కానీ పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఎన్ని డబ్బులు వెదజల్లినా కొనలేవని వైయస్‌ జగన్‌ ధైర్యంగా చెప్పారని గుర్తు చేశారు. అనవసరంగా వైయస్‌ జగన్‌పై విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. తండ్రిస్థాయి వ్యక్తిని అలా అనడం తప్పని టీడీపీ నేతలు అంటున్నారు. కొడుకు స్థాయి వ్యక్తి వైయస్‌ జగన్‌పై టీడీపీ అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌ మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ప్రజా ఆవేశాన్నే వైయస్‌ జగన్‌ ప్రతిబించించారని చెప్పారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అవమానపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లరి చేయాలని చూస్తే తమకు కార్యకర్తలు ఉన్నారని చురకంటించారు. 

నీతిగా ఉంటే టీడీపీలో చోటు ఉండదు
నీతిగా ఉంటే టీడీపీలో చోటు ఉండదని, డబ్బులుంటేనే టీడీపీలో డబ్బులు, గౌరవం దక్కుతుందని చంద్రబాబు మరోసారి రుజువు చేశారని ఎమ్మెల్యే కల్పన విమర్శించారు. 35 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏనాడైనా రాజ్యసభ సీటు ఎస్సీలకు ఇచ్చారా అని చంద్రబాబు సర్కార్‌ను నిలదీశారు. టీడీపీ తరుపున ముందుగా పుష్పరాజ్‌ పేరు తెరమీదకు తెచ్చి చివరకు ఆ సీటును డబ్బులకు అమ్ముకున్నారని టీడీపీ వర్గీయులే చెబుతున్నారన్నారు. రాజ్యసభ అభ్యర్థి కేటాయింపులో టీడీపీలో మరోసారి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందన్నారు.  నీతికి నిజాయితికి విలువలు ఇచ్చి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున విజయసాయిరెడ్డికి టికెట్‌ కేటాయించడం జరిగిందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్ముకున్న వ్యక్తికి టికెట్‌ కేటాయించడం పార్టీ నేతలందరికీ గర్వంగా ఉందన్నారు. అందుకు విరుద్ధంగా టీడీపీ సీనియర్‌ మోస్ట్‌లను పక్కనబెట్టి డబ్బులున్న వారికి టికెట్‌ను కేటాయించారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను ఒప్పుకొని లెంపలేసుకొని మిగిలిన మూడు సంవత్సరాల కాలంలో ప్రజాఉపయోగకర కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment