తాజా వార్తలు

Wednesday, 1 June 2016

రేవంత్ రెడ్డిని అనుమతించొద్దంటూ పిటిషన్

ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం జరగనున్న జనజాతర సభకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రాకుండా చూడాలని విద్యార్థి జేఏసీ చైర్మన్ బాలరాజ్ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. రేవంత్ రెడ్డి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున.. ఆయన్ను అడ్డుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్ ఆర్సీకి బాలరాజ్ పిటిషన్ సమర్పించాడు. సభకు రేవంత్ ను అనుమతించొద్దని బాలరాజ్ కోరాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment