తాజా వార్తలు

Saturday, 25 June 2016

యురేనియం కేసుతో భానుకిరణ్‌కు లింక్‌…!

యురేనియం కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భానుకిరణ్‌కు సంబంధం ఉందన్న వార్తలతో జైళ్లశాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. జైలు నుంచే వ్యవహారం నడిపించిన భాను… కోట్లు వెనకేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక నిజాలను నిగ్గుతేల్చే పనిలో పడింది సీఐడీ.
పిడుగు పడ్డప్పుడు తమ వద్ద ఉన్న పరికరం ద్వారా ఇరిడియం వెలికితీసి కోట్లు సంపాదించొచ్చచ్చంటూ ఓ బురిడీ గ్యాంగ్ చాలా మంది అమాయకుల్ని బుట్టలో వేసుకుంది. కోట్లలో మోసపోయాక తేరుకున్న పలువురు పోలీసులను ఆశ్రయించారు. సంచలనం సృష్టించిన ఈ కేసును సవాల్ గా తీసుకున్న సీఐడీ… 15 రోజులుగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది… విచారణ చివరి దశకు చేరుకుంటున్న టైంలో బయటకొస్తున్న కొత్త నిజాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
యురేనియం కేసుతో మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ కు లింకు ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో భాను ఉంటున్న చర్లపల్లి జైల్లోని మానస బ్యారక్‌లో విస్తృంతంగా తనిఖీలు చేశారు. అతని డబుల్ లాకప్‌లోకి తరలించారు. యురేనియం కేసులో సిఐడి అధికారులు విచారిస్తున్న శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డి… భానుకిరణ్ తో అనేక సార్లు ములాఖత్ అయినట్లు తేలింది. గత 6 నెలల్లో వారానికి రెండుసార్లు వీరిద్దరూ భానును కలిసినట్లు జైలు రికార్డులు చెబుతున్నాయి. జైల్లో ఉన్న నాలుగేళ్లలో మొత్తం 500 మందిని కలిశాడు భాను.
యురేనియం గ్యాంగ్ ను భానుకిరణే ఏర్పాటు చేసి… అమాయకులను బుట్టలో వేసుకొని కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న కోహ్లితో భాను గ్యాంగ్ సంబంధాలు పెట్టుకొని రెండేళ్లుగా ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment