తాజా వార్తలు

Thursday, 2 June 2016

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా…

సంజీవయ్య పార్కులో దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కృతమైంది. తెలంగాణ రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా 72 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు గల జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. 300 అడుగుల ఎత్తులో ఠీవీగా జాతీయ జెండా ఎగిరింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మిలటరీ బ్యాండ్ ‘సారే జహాసె అచ్ఛా’, ‘ఆజా ఆజా హిందుస్థానీ’ వంటి గీతాలను ఆలపిస్తుండగా, జాతీయ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment