తాజా వార్తలు

Friday, 24 June 2016

బిపాసా గంటన్నరకు కోటిన్నర తీసుకుందటా…!

గంటన్నర పాటు యోగా చేస్తే కోటిన్నర ఫీజు ఇస్తారా? జనాన్ని ఆకట్టుకోవడానికి ప్రభుత్వమే అందగత్తెల్ని తీసుకువచ్చి ఆసనాలు వేయించాలా? కర్నాటక ప్రభుత్వానికి అక్కడి ప్రజా సంఘాలు వేస్తున్న ప్రశ్నలివి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెంగళూరు ప్రభుత్వం నిర్వహించిన శిబిరంలో యోగా చేసింది బాలీవుడ్‌ నటి బిపాసాబసు. ఇందుకు గవర్నమెంట్‌ కోటిన్నర చెల్లించిందన్నది తాజా వివాదం.

బిప్స్‌కు కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన రెమ్యునరేషనే కోటిన్నర అట. అదిగాక రాను పోను ఖర్చులు, ఒక రోజు హోటల్‌లో ఉన్న బిల్లు అదనం. భారతీయ సంస్కృతికి అద్దంపట్టే యోగాను అభాసు పాలు చేశారన్న వివాదం రేగడంతో సిద్దరామయ్య సర్కార్‌ చిక్కుల్లో పడింది.
« PREV
NEXT »

No comments

Post a Comment