తాజా వార్తలు

Sunday, 26 June 2016

రాష్ట్రానికి కేంద్ర సాయంపై బీజేపీ వీడియో

ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక రెండేళ్లలోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు రూ.లక్ష కోట్లకు పైబడిన నిధులను మంజూరు చేసిందంటున్న బీజేపీ.. ఇక నుంచి చిన్న సినిమా రూపంలో ఆ వివరాలను ప్రజల ముందుంచాలనుకుంటోంది. దీనికోసం కేంద్రం నిధులతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన లఘు చిత్రాన్ని ఆ పార్టీ జాతీయ నాయకత్వం రూపొందించింది. 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో శాఖల వారీ జరిగిన పనుల పురోగతి, ఆయా కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ప్రజా జీవితంపై వాటి ప్రభావం తదితర అంశాలను పొందుపరిచింది.
ఆయా పథకాలకు దేశం మొత్తంలో కేంద్రం ఎన్ని నిధులు ఖర్చు పెడుతోంది.. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు మంజూరు చేసిందన్న వివరాలు ఇందులో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్ర, శనివారాల్లో జరిగిన బీజేపీ ఏపీ శాఖ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ చిన్న సినిమా సీడీలను ఆవిష్కరించారు. వీటిని సమావేశాలకు హాజరైన పార్టీ నాయకులకుఅందజేశారు. జిల్లాల వారీ పార్టీ నాయకులు ఈ సీడీల ఆధారంగా మరిన్ని సీడీలు తయారు చేసి గ్రామస్థాయి కార్యకర్తలకు పంపిణీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment