తాజా వార్తలు

Thursday, 30 June 2016

సినిమా స్టోరీని తలపించేలా ఇషాంత్ శర్మ, ప్రతిమ లవ్‌స్టోరీ

టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అన్ని ప్రేమ కథల్లాగా మనోడి ప్రేమ కథ స్కూల్లోనో, కాలేజిలోనో మొదలైంది కాదు. బాస్కెట్ బాల్ కోర్టులో ప్రతిమతో ఇషాంత్‌కు తొలిపరిచయం. ప్రతిమ సింగ్ బాస్కెట్ బాల్ ప్లేయర్. ఆమె మాత్రమే కాదు. ఆమె తోబుట్టువులు నలుగురూ బాస్కెట్ బాల్ ప్లేయర్సే కావడం విశేషం. ప్రతిమ అక్క ఆకాంక్ష బాస్కెట్ బాల్ ప్లేయర్ కావడంతో 2011లో ఢిల్లీలో నిర్వహించిన టోర్నీకి ఇషాంత్ శర్మను ఆహ్వానించింది. చీఫ్ గెస్ట్‌గా అక్కడికి వెళ్లిన ఇషాంత్ ప్రతిమను అక్కడే చూశాడు.
 
తన హైట్‌కు మ్యాచ్ అవుతుందనుకున్నాడో ఏమో తెలియదు కానీ తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడ్డాడు. అందరబ్బాయిల్లాగే ఇషాంత్ కూడా లవ్‌లో తొందరపడ్డాడు. ప్రతిమను బయటికెళ్తామా అంటూ ఆహ్వానించాడు. అయితే అక్కకు చెప్పకుండా ఏ పనీ చేయని ప్రతిమ ఈ విషయాన్ని కూడా ఆకాంక్షతో చెప్పింది. ఆకాంక్షకు ఇషాంత్ ఎలాంటోడో తెలుసు. దీంతో చెల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా మొదలైన వీరి ప్రేమ కథ సినిమా స్టోరీలా కాకుండా సీరియల్ స్టోరీలా చాలా రోజులు నడిచింది. పెళ్లి తర్వాత కూడా బాస్కెట్ బాల్ ఆడేందుకు అనుమతివ్వాలన్న ఒక్క కండీషన్ తప్ప ప్రతిమ ఇషాంత్‌ను మరేమీ కోరలేదు. ఆటను ప్రేమించే వ్యక్తిగా ఇషాంత్ కూడా ఆమె కోరికకు అడ్డుచెప్పలేదు. ఇలా ఈ ప్రేమ జంట ఒక్కటయ్యారు.
« PREV
NEXT »

No comments

Post a Comment