తాజా వార్తలు

Thursday, 9 June 2016

కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:బోండా ఉమ

కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమ‌ర‌ణ నిరాహార దీక్షపై టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ ఎందుకు దీక్ష చేస్తున్నాడో ఆయనకే తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు. తామిచ్చిన హామీల‌పై ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, వాటిని నెర‌వేర్చే క్రమంలోనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

డిమాండ్లను నెర‌వేర్చుకునే క్రమంలో ఆయనకు ఏవైనా సందేహాలుంటే సీఎంతో, కాపు నేత‌లు చ‌ర్చించుకోవచ్చునని, కాపుల హామీలను నెరవేర్చేది మాత్రం తమ ప్రభుత్వమేనని ఆయ‌న చెప్పారు. ముద్రగ‌డ త‌న చ‌ర్యల‌తో కాపులకు న‌ష్టం క‌లిగించేలా ప్రవ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని ఘ‌ట‌న‌లో విధ్వంసం సృష్టించిన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment