తాజా వార్తలు

Friday, 17 June 2016

ఆరోగ్య పరిస్థితిపై గోప్యమెందుకు?

కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని ప్రజలకు తెలియకుండా ఈ ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందో అర్థం కావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 67 ఏళ్ల వయసులో తొమ్మిది రోజుల దీక్ష తర్వాత కూడా ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు, పోలీసులు, రెవిన్యూ అధికారులు, మంత్రులు సరైన సమాచారం ప్రజలకు తెలియనివ్వడం లేదన్నారు.
ఎవరైనా చూసి వద్దామనుకున్నా ఆయన వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు పెట్టారని ఆక్షేపించారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై సామాజికవర్గాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తోంది. దీక్ష విషయంలో బేషజాలకు, ఒంటెద్దు పోకడలకు పోవడం మంచిది కాదు. ఎన్నికలప్పుడు మీరిచ్చిన హామీనే అమలు చేయాలన్న డిమాండ్‌కు పరిష్కారం చూపండి. ఈ అంశంలో రాజకీయ లబ్ధి గురించి ఆలోచించకండి. న్యాయం అడిగే వారినల్లా పోలీసుల ద్వారా అణిచి వేసి.. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చొద్దు. ప్రభుత్వం హుందాగా వ్యవహరించి సమస్యను పరిష్కరించాలి’ అని హితవు పలికారు.  

 దీక్షను కించపరుస్తూ ఆ మాటలేంటి?
 దీక్షపై అనుమానం వ్యక్తం చేస్తూ సొంత సా మాజిక వర్గ మంత్రులే కించపరిచేలా మాట్లాడడంపై బొత్స తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముద్రగడతో చర్చలనంతరం ఆయ న డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని డీఐజీ, జిల్లా ఎస్పీలు స్వయంగా మీడియా ముందు చెబితే.. కొద్దిసేపటి తర్వాత మంత్రులు చిన రాజప్ప, గంటా శ్రీనివాసరావులు ప్రభుత్వం డిమాండ్లను ఒప్పుకోలేదని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment