తాజా వార్తలు

Saturday, 11 June 2016

బాక్సింగ్‌ లెజెండ్‌కు తుది వీడ్కోలు…

బాక్సింగ్‌ లెజెండ్‌ మహ్మద్‌ అలీ అంత్యక్రియలు ముగిశాయి. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో కేవ్‌హిల్‌లోని ప్రైవేట్‌ స్మశానవాటికలో ఆయనకు వీడ్కోలు పలికారు. అంతకు ముందు లూయిస్‌ విల్లే వీధుల్లో భారీ ఎత్తున అంతిమ యాత్ర నిర్వహించారు.
వేలాది మంది అభిమానులు వీధుల వెంట నిలబడి తమ అభిమాన క్రీడాకారుడికి తుది వీడ్కోలు పలికారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌, హాలీవుడ్‌ హీరో విల్‌ స్మిత్‌ సహా పలువురు సినీ, రాజకీయ, క్రీడా దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
1960లో ఒలింపిక్‌ స్వర్ణం సాధించినప్పుడు అలీని ఘనంగా ఊరేగించిన మార్గంలోనే ఆయన చివరి యాత్రను కూడా నిర్వహించారు. చిన్నప్పుడు ఆయన చదువుకున్న స్కూల్‌, మొదట బాక్సింగ్‌ నేర్చుకున్న ఇన్‌స్టిట్యూట్‌… ఇలా అన్నిటినీ కలుపుతూ ఊరేగింపు కొనసాగింది.
అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో అలీ అభిమానులు హాజరైనా…. ఖననాన్ని మాత్రం పూర్తి కుటుంబ కార్యక్రమంగానే నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహిత మిత్రులు ఇందులో పాల్గొన్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో గత శనివారం తుది శ్వాస విడిచారు బాక్సింగ్‌ దిగ్గజం.
« PREV
NEXT »

No comments

Post a Comment