తాజా వార్తలు

Friday, 24 June 2016

ఆలయ భూముల లెక్క తేల్చనున్న టాస్క్‌ఫోర్స్‌…

తెలంగాణలో అన్యాక్రాంతమైన దేవాదాయ భూముల లెక్క తేల్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ… ఆలయ భూములు, అర్చకుల జీతభత్యాలపై చర్చించింది. రాష్ట్రంలో 12,300 ఆలయాల పరిధిలో 85,000 ఎకరాల భూమి ఉండగా, వాటిలో కొంత భాగం ఆక్రమణలకు గురైంది.
అయితే ఆక్రమణలకు గురైన భూముల లెక్కలను తేల్చనుంది టాస్క్‌ఫోర్స్‌. అర్చకుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్‌ త్వరలోనే నెరవేరుతుందన్నారు మంత్రి. ధూపధీప నైవేద్యాలకు ఇస్తున్న నిధులను పెంచుతామని, అర్చకులకు ప్రత్యేక నిధులిచ్చి వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment