తాజా వార్తలు

Tuesday, 28 June 2016

రాజధాని సింగపూర్ కంపెనీల కోసమే.. ఎమ్మెల్యే రోజా

అమరావతి రాజధాని సింగపూర్ కంపెనీల కోసమే అని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, మహిళా విభాగం అధ్యక్షురాలు  ఆర్కే రోజా అభివర్ణించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం రాజధానిని నిర్మించటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, కానీ అదేమీ పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆమె అన్నారు. అసలు చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా లేక విదేశాల బాగు చూసుకొనే నాయకుడా అని ఆమె నిలదీశారు. అలనాడు తెల్లవాళ్లను తరిమికొట్టిన మనం, ఇప్పుడు విదేశీయుల్ని నెత్తిన ఎక్కించుకొంటున్నామని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఈ పోకడల్ని కట్టిపెట్టాలని రోజా హితవు పలికారు. స్విస్ చాలెంజ్ విధానాన్ని అంతా తిరస్కరించారని ఆమె గుర్తు చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment