తాజా వార్తలు

Thursday, 2 June 2016

రేవంతరెడ్డిపై కేసు నమోదు

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై ఉస్మానియూ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన జనజాతర కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు ఆదేశాల ధిక్కరణ కింద రేవంత్‌రెడ్డితోపాటు చెరుకు సుధాకర్, ఎన్నమ్ శ్రీనివాస్‌రెడ్డి, బెల్లయ్యనాయక్, నిర్వాహకులపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment