తాజా వార్తలు

Saturday, 25 June 2016

రేవంత్ అనుచిత వ్యాఖ్యలు : కేసు నమోదు

ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి.. దీక్ష తొలిరోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీంతో మన్నె గోవర్ధన్ రెడ్డి అనే టీఆర్‌ఎస్ నేత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు రేవంత్‌రెడ్డిపై 504, 290, 188, 21/76 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment