తాజా వార్తలు

Tuesday, 28 June 2016

హైకోర్టు విభజనకు కేంద్రం సానుకూలం…!

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై కేంద్రం సానుకూలంగా ఉందన్నారు కేంద్రమంత్రి దత్తాత్రేయ. రాష్ట్రంలో న్యాయవాదుల, న్యాయమూర్తుల ఆందోళనలను… కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు ఆయన. దీనిపై స్పందించిన రాజనాథ్‌ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారని తెలిపారు.

త్వరలోనే రాజ్‌నాథ్‌సింగ్‌… గవర్నర్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులతో మాట్లాడుతారని దత్తాత్రేయ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకోవాల్సిన సమస్యను కేసీఆర్ రోడ్డు మీదకు లాగడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలని సూచించారు దత్తాత్రేయ. ఈ సమస్యపై కేంద్రాన్ని నిందించడం సరికాదని ఆయన హితవు పలికారు బండారు.

ఈ సమస్యను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఆ రాష్ట్రంలో ఉండాలని ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగా ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆరు నెలల్లోగా ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు దత్తాత్రేయ.
« PREV
NEXT »

No comments

Post a Comment