తాజా వార్తలు

Monday, 13 June 2016

జల వివాదాల పరిష్కారానికి రంగంలోకి కేంద్రం…

ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల మధ్య జల వనరుల వివాద పరిష్కారం కోసం రంగంలోకి దిగింది కేంద్ర ప్రభుత్వం. చర్చల కోసం ఈనెల 21న ఢిల్లీ రమ్మని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కబురు పెట్టింది కేంద్ర జలవనరుల శాఖ. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్ని జల వివాదాలపై చర్చ జరగనుంది.

కృష్ణా ట్రిబ్యునల్‌ వ్యవహారశైలి సరిగా లేదంటూ ఇటీవల కేంద్రానికి ఫిర్యాదు చేసింది తెలంగాణ. వాటాల విషయంలో కూడా ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఇప్పుడు ఏపీ, తెలంగాణ వాడుకోవడం కాకుండా బేసిన్‌లోని నాలుగు రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవాలన్నది తెలంగాణ వాదన. 21న జరిగే మీటింగ్‌లో వీటన్నిటిపై చర్చ జరిగే అవకాశం ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment