తాజా వార్తలు

Thursday, 2 June 2016

అధైర్యపడకుండా ముందుకు సాగుదాం: చంద్రబాబు

మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, అధైర్యపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుందని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే 2022కల్లా దేశంలోని టాప్‌ త్రీ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలోని బెంజి సర్కిల్ లో ఆయన ప్రజల చేత నవనిర్మాణ ప్రతిఙ్ఞ చేయించారు.

అనంతరం మాట్లాడుతూ.., దశాబ్ధకాలంగా తుఫాన్లు, కరువుతో ఆంధ్రప్రదేశ్‌ అల్లాడుతోందని, కష్టాలున్నాయని  దిగులుపడితే సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటామని దీన్నో సవాలుగా తీసుకుని పనిచేయాలని  పిలుపునిచ్చారు. విభజన సమయంలో సమన్యాయం పాటించకపోవటం వల్లనే ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం మిగిలిన దక్షిణాది రాష్ట్రాలకంటే తక్కువగా ఉందని అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేలా ఆంధ్రప్రదేశ్‌కు సహకరించాల్సిన బాధ్యత కేంద్రంతో పాటు బిల్లుకు మద్దతిచ్చిన అన్ని రాజకీయపక్షాలపైనా ఉందని చంద్రబాబు తెలిపారు.


ఇక ఉమ్మడి రాజధానిగా పదేళ్లు అవకాశమున్నా పరిపాలన సౌలభ్యం కోసం రెండేళ్ళలోపే అమరావతి నుండి  పాలనను సాగిస్తున్నామని తెలిపారు. మిత్రధర్మాన్ని పాటించి బీజేపీ కోరగానే ఒక రాజ్యసభ సీటుని ఆ పార్టీకి  కేటాయించామని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రానికో అండకావాలనే కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలుగుతున్నామని వెల్లడించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment