తాజా వార్తలు

Monday, 6 June 2016

సౌకర్యాలు లేవని చెప్పడం సరికాదు:చంద్రబాబు…

హైదరాబాద్ నుండి ఇక్కడకు రావడానికి, సౌకర్యాలు లేవని ఉద్యోగులు చెప్పడం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం కుదిరినన్నీ సౌకర్యాలు కల్పించామని, రాబోయే రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాని తరలింపుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు బాబు. అయితే ఈ నెల 27వ తేదీకల్లా సచివాలయంలోని కొంత మంది ఉద్యోగులను వెలగపూడికి తరలిస్తామని, తర్వాత మిగతా వాళ్లు కూడా వస్తారని ఆయన అన్నారు.
ఇక ప్రతిపక్ష నేత జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.., “తన 40ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రతిపక్ష నేతను చూడలేదన్నారు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి అభ్యంతరక వ్యాఖ్యలు చేసి వాటిని సమర్ధించుకోవడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment