తాజా వార్తలు

Thursday, 2 June 2016

అందరి గుట్టు నా ‘గుప్పిట్లో’: సీఎం

‘మనుషులు మోసం చేస్తారేమో కానీ.. టెక్నాలజీ మోసం చేయదు. అందుకే నేను టెక్నాలజీని నమ్ముకున్నా. ఏడాదిలో అందరి గుట్టూ నా చిన్న ఫోన్లో ఉంటుంది..’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ హాలులో గురువారం టీడీపీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే జూలై కల్లా ఫైబర్ కనెక్షన్  పూర్తవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సీఎం సమక్షంలో టీడీపీలో చేరారు.
అమరావతి మెడికల్ హబ్‌గా రూపుదిద్దుకోనుందని బాబు అన్నారు.పీఎంఎస్‌ఎస్‌వై ద్వారా విడుదల చేసిన రూ.150 కోట్లతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌కు చంద్రబాబు భూమిపూజ నిర్వహించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment