తాజా వార్తలు

Thursday, 30 June 2016

ముగిసిన చైనా టూర్… ఢిల్లీకి చేరుకోనున్న ఏపీ సీఎం…

ఏపీ సీఎం చంద్రబాబు బృందం చైనా పర్యటన ముగిసింది. చివరి రోజు పర్యటనలో భాగంగా జిజోలో ఏర్పాటు చేసిన ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు. దాదాపు 200కు పైగా చైనా పెట్టుబడిదారుల కంపెనీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఇందులో ఏపీ పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్రసమర్థతలపై చంద్రబాబు బృందం షార్ట్‌ ఫిల్మ్‌ను ప్రదర్శించింది.

అంతేకాకుండా ఏపీలోపర్యాటక రంగం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు చంద్రబాబు. గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రపంచంలోని 10 అత్యుత్తమ రాజధానుల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని చైనా ప్రతినిధులకు వెల్లడించారు బాబు. అనంతరం జిజో నుంచి చంద్రబాబు బృందం హాంకాంగ్‌ మీదుగా ఢిల్లీకి చేరుకోనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment