తాజా వార్తలు

Thursday, 9 June 2016

సీఎం చెవిలో సెక్యూరిటీ చెప్పిందేమిటి?

సీఎం చంద్రబాబు గురువారం ఉదయం ప్రెస్‌మీట్‌లో ఉన్నారు. అది జరుగుతుండగానే మధ్యలో సీఎం సెక్యూరిటీ అధికారి వేగంగా అక్కడకు వచ్చి సీఎం చెవిలో ఏదో చెప్పారు. వెంటనే ఆయన ప్రెస్‌మీట్‌ ముగించి వెళ్లారు. దీనిపై పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం దీక్ష పరిణామాల గురించి సెక్యూరిటీ అధికారి చెప్పారని, ఆయన్ను అరెస్టు చేసే అంశంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎంతో చర్చించాల్సి ఉండడంతో సెక్యూరిటీ అధికారి ఈ విషయాన్ని సీఎం చెవిలో వేశాడని, అందుకే వెంటనే ప్రెస్‌మీట్‌ నుంచి వెళ్లిపోయారని ఓ వాదన. అయితే సీఎం బ్యాంకర్ల సభలో పాల్గొనాల్సి ఉండడంతో సమయం అయినందున ఆ విషయాన్ని సీఎంకు సెక్యూరిటీ గుర్తు చేసినట్లు మరో వాదన నడుస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment