తాజా వార్తలు

Wednesday, 22 June 2016

తొలి రోజు షూటింగ్ లో పాల్గొనబోతున్న బాస్…

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 9 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ఈ రోజు సెట్స్ మీదకు వెళ్లనుంది. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన సినిమా టీం మెగాస్టార్ రాక కోసం ఇన్ని రోజులుగా ఎదురుచూసింది.
ఇక ఇప్పుడు అన్ని పనులను పూర్తి చేసుకున్న చిరు, ఈ రోజు నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. దీంతో అభిమానులు బాస్ స్టార్ట్ అయిపోయాడంటూ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. తమిళ మూవీ ‘కత్తి’ రీమేక్ లో మెగాస్టార్ నటిస్తుండగా, లైకా ప్రొడక్షన్ తో కలిసి రామ్ చరణ్ సంయుక్త నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఇంకా కథానాయిక ఎంపిక కాలేదు.
« PREV
NEXT »

No comments

Post a Comment