తాజా వార్తలు

Wednesday, 1 June 2016

సచిన్, చిరు, నాగ్.. ఇక బిజినెస్ పార్ట్ నర్లు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తెలుగు సినీ దిగ్గజాలు చిరంజీవి, నాగార్జునతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పుడు వ్యాపార భాగస్వాములయ్యారు. కేరళ బ్లాస్టర్స్ పేరుతో ఫుట్ బాల్ జట్టును కొనుగోలు చేశారు. గతంలో చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ భాగస్వాములుగా ఉన్నారు. వీరు ఓ తెలుగు టీవీ చానెల్ ను నిర్వహించారు. ఇప్పుడు తెలుగు సినీ ప్రముఖులతో సచిన్ వ్యాపార భాగస్వామి అయ్యాడు.
సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులతో పాటు  చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం వారు శ్రీవారిని సందర్శించుకున్నారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నట్టు సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment