తాజా వార్తలు

Tuesday, 28 June 2016

జూలై 16న ‘చుట్టాలబ్బాయ్’ ఆడియో…

ఆది, నమిత హీరో హీరోయిన్లుగా వీరభద్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చుట్టాలబ్బాయ్’ సినిమాకు ఆడియో రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. జూలై 16న ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ”ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని, జూలై 16న ఆడియోను రిలీజ్ చేసి ఆ తరువాత సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. ఇక ఈ సినిమాలో ఆది కొత్త లుక్‌తో, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో అందరినీ ఆకట్టుకుంటాడని, ఇప్పటికే రిలీజైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని తెలిపారు. ‘పూలరంగడు’ తర్వాత ఈ సినిమాతో వీరభద్రమ్ మరో భారీ హిట్ కొడతారన్న నమ్మకం” ఉందని చెప్పారు.

ఈ మూవీలో సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించగా బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. రామ్ తాళ్ళూరి, వెంకట్ తలారి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment