తాజా వార్తలు

Monday, 20 June 2016

చంద్రబాబు ఫోటోలకు ఫోజులివ్వడం కాదు...

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్భాటంగా ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు ఏమీ ఒరగదని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఏరువాక పేరుతో ఫోటోలకు ఫోజులివ్వడం కాదని, రైతుల పరిస్థితిని గమనించాలని పార్థసారధి ఈ సందర్భంగా చంద్రబాబుకు సూచించారు.

రైతుల జీవితాలు కుదేలైపోయాయని, నిర్దిష్టమైన ప్రణాళిక విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు అవసరం అయిన విత్తనాలు ఎప్పుడు అందుబాటులో ఉంచుతారో స్పష్టత ఇవ్వాలన్నారు. చంద్రబాబుకు పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని పార్ధసారధి విమర్శించారు.


కాగా పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏరువాకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కేంద్ర సాయంతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. అలాగే జిల్లాలో ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment