తాజా వార్తలు

Monday, 20 June 2016

కేసీఆర్‌ ప్రజెంటేషన్‌కు కాంగ్రెస్‌ 3డీ కౌంటర్‌…!

కేసీఆర్ ఇచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పవర్ ప్రజెంటేషన్‌కు కౌంటర్ ప్రజెంటషన్ కు కాంగ్రెస్ రెడీ అయ్యింది. ఈనెలాఖ‌రులో కేసీఆర్ ఇచ్చిన గూగుల్ ప్రజెంటేషన్ కు దీటుగా 3D ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించారు తెలంగాణ నేతలు.
ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ త‌ర్వాత .. అదే నెల‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇవ్వాల‌ని భావించింది కాంగ్రెస్… అయితే ఉప ఎన్నికల్లో వరుస ఓట‌ములు, ఇంకోవైపు పార్టీలో నేత‌ల కుంప‌ట్లు, వలసలు… ఇలా అన్ని ఓకే సారి చుట్టుముట్టడంతో ప్రజెంటేషన్‌పై అడుగు ముందుకు ప‌డ‌లేదు… అయితే సీఎంతో సహా కాంగ్రెస్ ప్రజెంటేషన్ కోసం ఎదురు చూస్తున్నామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించడంతో కాంగ్రెస్ పై ఒత్తిడి పెరిగింది.
ఆ క్రమంలోఈ ప్రజెంటేషన్‌పై భారీ క‌స‌ర‌త్తు చేస్తోంది కాంగ్రెస్… ఇప్పటికే సాగునీటి రంగ నిపుణుల ఆలోచ‌న‌లు, సూచ‌న‌లను తీసుకున్న పార్టీ… గ‌తంలో ప‌రిపాల‌న‌లో కీల‌కంగా వ్యవహరించిన నేత‌ల అభిప్రాయాల‌ను సేకరించింది… ఆ సమాచారంతో ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌తో రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి సిద్దమవుతున్నారు కాంగ్రెస్‌ నేతలు… ముఖ్యంగా కృష్ణా, గోదావ‌రిల‌తో తెలంగాణకు మ‌రింత ల‌బ్ది చేకురేలా ఎలా ముందుకు వెళితే బాగుంటుంద‌న్న విష‌యాన్ని.. ఆధారాలు, లెక్కలతో ప్రజెంటేషన్‌లో చూపించాలని భావిస్తున్నారు.
ప్రాణ‌హిత డిజైన్ మార్పుతో… ఓ జాతీయ హోదా ప్రాజెక్టును కోల్పోయామంటున్న కాంగ్రెస్.. దాని వల్ల80 వేల కోట్ల అద‌న‌పు భారం ప‌డింద‌న్న విష‌యాన్ని ప్రజలకు వివ‌రించ‌నుంది… అంతేకాకుండ రీడిజైన్ కార‌ణంగా తెలంగాన‌కు రావ‌ల్సిన శ‌బ‌రిన‌ది నీటిని పూర్తిగా కోల్పోతున్నామ‌న్న విష‌యాన్ని చెప్పనుంది.. మ‌రోవైపు పాల‌మూర్ — రంగారెడ్డి ప్రాజెక్ట్ కొత్త డిజైన్ కార‌ణంగా జరిగే నష్టాన్ని.. ప్రజలకు వివరిస్తామంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.. అలాగే కేసీఆర్ చెప్పిన ప్రతి అంశానికి కౌంటర్ ఇస్తామంటున్నారు
ఇక కేసీఆర్ ఇచ్చిన చోటే తాము ప్రజెంటేషన్‌ ఇవ్వాల‌ని నిర్ణయించింది కాంగ్రెస్… దానికోసం అసెంబ్లీని ప్రత్యేకంగా స‌మావేశ‌ప‌ర్చాల‌ని స్పీక‌ర్‌ని క‌లిసి కోర‌నుంది… అది సాధ్యం కాక‌పోతే.. అసెంబ్లీలోని క‌మీటి హాల్లో ప్రజెంటేషన్‌ ఇవ్వాల‌ని భావిస్తోంది… ఒక వేళ అదికూడా సాధ్యం కాక‌పోతే… ప్రభుత్వతీరును ప్రజలకు వివ‌రిస్తు.. నెక్లేస్ రోడ్ లోని పిపుల్స్ ప్లాజాలో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఏర్పాటు చేసి.. దానికి సీఎంతో పాటు మేధావులు, నిపుణుల‌ను ఆహ్వానించాల‌ని నిర్ణయించింది హ‌స్తం పార్టీ.
ఇప్పటికే రెండు సార్లు డెమో చూసిన పార్టీ నేతలు ప్రజెంటేషన్‌కు ఫైనల్ టచ్ ఇస్తున్నారు… మొత్తం మూడున్నర గంటల నిడివి గల ప్రజెంటేషన్ సిద్ధం చేశారు… పీసీసీ ప్రెసిడెంట్‌తో పాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు ఈ ప్రజెంటేషన్ ను వివరించనున్నట్లు తెలుస్తోంది… ఇక కేసీఆర్ గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రజెంటేషన్ ఇస్తే …కాంగ్రెస్ నేతలు దాన్ని మించి 3D మ్యాప్ లు రెడీ చేశారు… మొత్తానికి కాస్త లేట్ అయినా.. లెటెస్ట్ గా ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.
« PREV
NEXT »

No comments

Post a Comment