తాజా వార్తలు

Tuesday, 14 June 2016

బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలి : గుండా మల్లేష్‌

సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని,  కొత్తగా ఏర్పడే తూర్పు జిల్లా కేంద్రంగా బెల్లంపల్లిని ప్రకటించడమే శాస్త్రీయమని సీపీఐ రాష్ట్ర నాయకుడు గుండా మల్లేష్‌ పేర్కొన్నారు. సోమవారం ప్రింట్‌ మీడియా ప్రెస్‌క్లబ్‌లో బెల్లంపల్లి జిల్లా సాధన కమిటీ సభ్యులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అశాస్త్రీయమైన విధానాలతో మంచిర్యాలను జిల్లా కేంద్రంగా చేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి పట్టణం పాలనకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా భీమిని మండలం కన్నెపల్లిని సైతం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు కలెక్టర్‌ను సోమవారం కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, పాటి సుభద్ర, బెల్లంపల్లి జిల్లా సాధన కమిటీ సభ్యులు సూరిబాబు, జయరాం, చంద్రయ్య, చిప్ప నర్సయ్య, కౌన్సిలర్‌ పూర్ణిమ, ప్రసాద్‌ గౌడ్, ఎనుగందుల వెంకటేశ్, అఫ్జల్, సల్లా సంజీవ్, తేజ్‌ ప్రకాశ్‌ అగర్వాల్‌లు ఉన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment