తాజా వార్తలు

Wednesday, 15 June 2016

చివరి రీల్లోనూ జగనే విలన్‌గా మిగులుతారు…!

వైఎస్‌ఆర్సీ అధినేత జగన్‌ తెలంగాణతో కుమ్మక్కై రాజకీయ పార్టీ నడుపుతున్నారని విమర్శించారు… మంత్రి దేవినేని ఉమ. పోలవరం ప్రాజెక్టును గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ద్వారా అడ్డుకోడానికి జగన్‌ కోట్లు ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు దేవినేని ఉమామహేశ్వరరావు.
గాలేరు-నగరి ద్వారా కడప జిల్లాకు నీరిద్దామని ప్రయత్నిస్తుంటే… ఆ పనుల్ని కూడా అడ్డుకుంటున్నారని దేవినేని మండిపడ్డారు. మరోవైపు నిన్న విజయవాడలో జరిగిన వైఎస్‌ఆర్సీ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా కథ చెప్పిన జగన్… రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు దేవినేని ఉమ.
జగన్ సినిమా సెటైర్లను ప్రస్తావించిన మంత్రి దేవినేని… తొలి రీల్లోనే జైలుకెళ్లిన జగన్ విలన్‌గా మారిపోయారన్నారు. చివరి రీల్లోనూ చంద్రబాబే హీరో అని… జగన్‌ మళ్లీ జైలుకు వెళ్లడం తప్పదని వ్యాఖ్యానించారు దేవినేని ఉమ.
రాజకీయ చదరంగంలో జగన్ అతినీతి తిమింగలమే అన్నారు దేవినేని. వైఎస్‌ఆర్సీ సమావేశంలో చేసిన తీర్మానాలు చూస్తే ఆ పార్టీ డొల్లతనం బయటడిపోయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరెత్తడానికే జగన్ భయపడుతున్నారని దేవినేని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ మంచి పథకాలు కాబట్టే… ప్రతిపక్షం విమర్శించలేకపోతుందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment