తాజా వార్తలు

Wednesday, 15 June 2016

పార్టీ వీడిన వారు రాజీనామ చేయాలి…!

తెలంగాణ ప్రభుత్వం అనైతిక రాజకీయాలకు పాల్పడతుందని అన్నారు కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీవ్రమవుతున్న వలసలపై సమీక్షంచడానికి ఆయన హైదరాబాద్‌ వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీని వీడుతున్న నేతలు పదవులకు రాజీనామా చేయాలని దిగ్విజయ్‌ కోరారు.
వ్యాపారాలు, ప‌ద‌వుల‌ను కాపాడుకునేందుకే నేత‌లు పార్టీ వీడుతున్నారని ఆరోపించారు దిగ్విజయ్‌. ఎంత మంది పార్టీని వీడినా రాష్ట్రంలో కాంగ్రెస్‌కి వ‌చ్చిన న‌ష్టమేమీ లేదన్నారు. పార్టీ నాయ‌కుల్లో విభేదాలను త‌గ్గించి, స‌మ‌న్వయం పెరిగేలా చెయ్యాల‌ని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందన్నారు దిగ్విజయ్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment