తాజా వార్తలు

Thursday, 16 June 2016

కేసీఆర్, చంద్రబాబు ఇద్దరు దోస్తులు: దిగ్విజయ్ సింగ్

ఏంపీ గుత్తా సుఖేందర్ కుటుంబం 800కోట్ల కాంట్రాక్ట్ వర్క్స్ తీసుకునందువల్లే టీఆర్ఏస్ లో చేరారని కాంగ్రెస్ పార్టీ ప్రదాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. నేతలు పోయినంత మాత్రన పార్టీకి నష్టం లేదని, కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.., రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడి ప్రజావ్యతిరేక విదానాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుందని, కేసిఆర్, చంద్రబాబు ఇద్దరు దోస్తులేనని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ టీఆర్ఏస్ కు సహకరించిన్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో సీఏం కేసిఆర్ కుటుంబ పాలన నడుస్తుందని, క్యాబినెట్ లో మహిళలకు, వెనకబడిన వర్గాల వారికి చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు. అలాగే పత్తి రైతులకు బోనస్ ఇచ్చి ప్రభుత్వమే ఆదుకోవాలని సూచించారు. అయితే ఇప్పట్లో పీసిసి అద్యక్షుడిని మార్చే ఆలోచన లేదని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment