తాజా వార్తలు

Thursday, 2 June 2016

కేసీఆర్‌పై దిగ్విజయ్‌ ‘ట్వీట్ల’పురాణం..!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌… ట్విట్టర్‌ వేదికగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన దిగ్విజయ్‌… సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ పక్కన పేదప్రజలు మరణిస్తుంటే… రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు చేయడం సిగ్గుచేటని విమర్శించారు దిగ్విజయ్‌సింగ్‌. ఈ రెండేళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందంటూ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని… ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు చెబుతున్నానని దిగ్విజయ్‌సింగ్‌ ట్వీట్ చేశారు. రైతుల ఆత్మహత్యలు, వడదెబ్బ మరణాలు, నిరుద్యోగ సమస్యలతో రాష్ట్రం సతమతమవుతుంటే… ప్రకటనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం సరికాదన్నారు దిగ్విజయ్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment