తాజా వార్తలు

Sunday, 26 June 2016

వేలకోట్లు వెనకేసుకుంటున్నారు : డీకే అరుణ

ప్రాజెక్టుల డిజైన్ల మార్పుపేరుతో సీఎంతోపాటు ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. బడంగ్‌పేటలో ఆదివారం పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్‌లో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీకేఅరుణ మాట్లాడుతూ.. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారన్నారు. తెలంగాణ కోసం 2వేలకు పైగా అమరులు ప్రాణ త్యాగాలు చేశారనిఅప్పట్లో అన్నారని, అయితే నేడు 450 మందినే గుర్తించారన్నారు. రెండేళ్లుగా రాష్ట్రలో కరువు పరిస్థితి నెలకొందని, కేంద్రం అందిస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీనికూడా రైతులకు ఇచ్చిన పాపన పోలేదని విమర్శించారు. 2లక్షల కోట్ల వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎందుకిచ్చినావో జర చెప్పరాదా? అని నిలదీశారు.

రాష్ట్రంలో ఎక్కడా పింఛన్లు అందడం లేదని అన్నారు.  మాజీ హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో ఘోరంగా విఫలం అయిందని అన్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్‌జెండాను ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి రవీందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, నియోజకవర్గ ఇంచార్జీ పి.కార్తిక్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

 
« PREV
NEXT »

No comments

Post a Comment