తాజా వార్తలు

Wednesday, 15 June 2016

ప్రకాశం, నెల్లూరులో మరోసారి భూప్రకంపనలు…

ప్రకాశం,నెల్లూరు జిల్లాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు స్థానికులను భయపెట్టాయి. ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో భూమి కంపించింది. అలాగే పామూరు, సీఎస్‌పురం మండలాల్లో కూడా స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. 24 గంటల వ్యవధిలో మూడుసార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయంభయంగా గడుపుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment