తాజా వార్తలు

Wednesday, 15 June 2016

మూతపడిన ఈఫిల్ టవర్… నిరాశలో పర్యాటకులు…

వచ్చే టూరిస్ట్ లకు సరిపడా స్టాప్ లేరని, దీంతో చాలా ఇబ్బందులు ఎదరుర్కొంటున్నామని ఈఫిల్ టవర్ దగ్గర పనిచేసే కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో ఈఫిల్ టవర్ ను చూసేందుకు ఎవ్వరినీ అనుమతించడం లేదు అధికారులు.
ఈఫిల్ టవర్ దగ్గరకు వెళ్లే టూరిస్ట్‌లను రిసీవ్ చేసుకోవడం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, టవర్ వద్ద పనిచేయడం, మొదలైన పనులు నిర్వహించడం తమకు చాలా కష్టమవుతుందని అక్కడి కార్మికులు ధర్నా చేస్తున్నారు. ప్రతిరోజూ 15 నుంచి 20 వేల మంది ఇక్కడకి వస్తుంటారని, తగిన స్టాప్ లేకపోవడంతో ఒక కార్మికుడు రెండు, మూడు డిపార్ట్ మెంట్స్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనను తెలపుతున్నారు. దీంతో ఈఫిల్ టవర్ ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు.
« PREV
NEXT »

No comments

Post a Comment